రేవూరి ప్రకాశ్ రెడ్డి,వొడితల ప్రణవ్..
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //21//హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం చైతన్యవంతమైనదని,పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి, అని పార్టీ కో-ఆర్డినేటర్ ల సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్,అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని,హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇవ్వాలని పరకాల ఎమ్మెల్యే రెవూరి ప్రకాష్ రెడ్డి కోరారు.శుక్రవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో, హుజరాబాద్ పట్టణ,మండల కో-ఆర్డినేటర్ల సమీక్షసమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ సత్తా చాటాలని కో-ఆర్డినేటర్ లను కోరారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓటరును నేరుగా కలవాలని సూచించారు.ప్రతి కార్యకర్త కష్టపడితేనే విజయం సాధిస్తామని తెలిపారు.పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అది ఓటర్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ నాయకులు పాల్గొన్నారు.