పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా త్వరలో జరుగనున్న ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలనికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం దిగనున్నారు పోటీ చేసేందుకు అయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు జర్నలిస్టు గా సామాజిక కార్యకర్తగా సూపరిచితుడైనా సయ్యద్ కరీం నాలుగు దశబ్దాలుగా ప్రధాన తెలుగు దిన పత్రికల్లో పని చేసిన ఆయన అనేక సమస్యలను వెలికి తీసి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధాన పాత్ర పోషించారు అభ్యుదయ భావాలు కలిగి ఉన్న ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో పరిచయాలు ఉన్నాయి 2013లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయన 'ప్రభాతసమాచారం' తెలుగు దినపత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్నారు.