ఈ రోజు A కొండూరు మండలం కంభంపాడు గ్రామం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశము. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.: జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ భాను తో కలిసి పాల్గొన్న గౌరవ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఈ సమావేశములో నియోజకవర్గ పరిశీలకులు చిట్టా బత్తిన శ్రీనివాసరావు , ఎం ఎల్ సి.ఎలెక్షన్ పరిశీలకులు డేగల ప్రభాకర్ ( ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్) మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు పాల్గొనడం జరిగినది. ఈ సమావేశములో రానున్న ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎం ఎల్ సి. ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది. మరి ముఖ్యంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని గెలిపించాల్సిన బాధ్యత జనసేన నాయకులు పై మరింత ఎక్కువగా ఉంది అని జనసైనికులు నాదెళ్ల మనోహర్ గారి కోసం ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు చేసిన త్యాగాన్ని మరొక్కసారి గుర్తు చేసుకొని ఆలపాటి రాజా గారి గెలుపులో కీలకపాత్ర జనసైనికులు పోషించాలని కోరడం జరిగినది.