
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )జిల్లెడ్ చౌదరి గూడ మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నల్లపూసల లక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అండగా నిలిచారు.అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రూ. 2,25,000 విలువైన ఎల్.ఓ.సి (LOC) పత్రాన్ని లాల్ పహాడ్ చౌరస్తాలో లక్ష్మి కుటుంబ సభ్యులకు ఆయన స్వయంగా అందింప చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆపదలో ఉన్న వారికి ఎల్.ఓ.సి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.సకాలంలో స్పందించి పెద్ద మొత్తంలో వైద్య సహాయం అందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి లక్ష్మి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎల్ఓసి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ జిల్లెడ్ చౌదరిగూడ మాజీ జెడ్పిటిసి బంగారు స్వరూప రాములు,కొందుర్గు జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ,జిల్లెడ్ చౌదరిగూడ మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాబురావు,జిల్లెడ్ చౌదరిగూడ మాజీ మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు,సర్పంచులు జ్యోతి శ్రీనివాస్ రెడ్డి,అనూష రవీందర్ రెడ్డి,కన్న జంగయ్య,రవి నాయక్,ఉప సర్పంచులు బాల్ రాజు,శేఖర్,మంగలి శేఖర్, మాజీ సర్పంచ్లు హరి నాయక్, శ్రీశైలం,శివ కుమార్,గోపాల్ నాయక్,నాయకులు రమేష్ నాయక్,దశరథం,ఎదిర శ్రీనివాస్ రెడ్డి,ఎదిర నర్సింలు, శేఖర్,తుంపల్లి లక్ష్మణ్, నవీన్ పటేల్, తుంపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.