
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్12(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలంలోని పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమం అనంతపురం ఏ డి ఏ జీఎం అల్తాఫ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగినది. యాడికి లోని శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ , సుఫలా ఫర్టిలైజర్స్ అలాగే రాయల్ చెరువులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్,న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాలలో తనిఖీలు చేపట్టడం జరిగినది. తనిఖీల్లో భాగంగాశ్రీ వెంకట్ ఫర్టిలైజర్ దుకాణంలో అనుమతి అయిపోయినాకూడా అమ్మకాలుమరియు నిల్వలుఉండడం గుర్తించిఅలాగే రైతులకుఇచ్చే బిల్లులలోఎటువంటి వివరాలు రాయకుండాఇవ్వడం గమనించి ఫ్యాక్ట్ కంపెనీకిచెందిన 38 టన్నులఎరువులు వాటి విలువ రూ.7,44,405/- సీజ్ చేసికోర్టుకు సమర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండలవ్యవసాయ అధికారిమహబూబ్ బాషా గారు పాల్గొన్నారు.
