
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ( ఎల్ ఎల్ బి )పట్టా విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థి సంఘ నాయకుడు శీతలకర్ అరవింద్‌ను నిర్మల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ, విద్యా రంగంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న శీతలకర్ అరవింద్ (ఎల్ ఎల్ బి )పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తూనే న్యాయ విద్యను అభ్యసించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.విద్యా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై ప్రశ్నిస్తూ, విద్యార్థులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్న అరవింద్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తన విద్యా జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శీతలకర్ అరవింద్ మాట్లాడుతూ, తన విద్యా ప్రయాణంలో తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కులు, విద్యా రంగ సమస్యలపై తన పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు.ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సన్మానం అరవింద్ విద్యా ప్రస్థానంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచింది అని అన్నారు.