
( పయనించే సూర్యుడు మార్చి 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామంలో జీవిత భీమా సంస్థ ఎల్ ఐ సి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్ ఐ సి ఏజెంట్లు నరేష్, నవీన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో గల మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. మహిళలకు భద్రత, ఎంపవర్మెంట్పై చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్లు నరేష్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక భద్రత కోసం ఎల్ఐసి ప్రత్యేక పాలసీలు, పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు.సామాజిక సేవలో భాగంగా భారతీయ జీవిత భీమా సంస్థ విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి ఎన్నో వినూత్నమైన సేవలు చేస్తుందని అన్నారు.
అంతేకాకుండా మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి అభివృద్ధికి ఎల్ఐసి కట్టుబడి ఉందని తెలిపారు.మహిళా దినోత్సవం రోజుననే కాకుండా ప్రతిరోజు మహిళలు గౌరవించబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి శ్వేతా, ఏ ఎన్ ఎమ్ గౌసియా బేగం,ఆశ కార్యకర్తలు యాదమ్మ, జ్యోతి, సరోజ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
