
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :తానుర్ మండలంలోని దాగం గ్రామానికి చెందిన పిక్కల్కర్ చిన్న లక్ష్మణ్ కు ఆరోగ్యం బాగాలేక నిమ్స్ ఆస్పత్రిలో చేరడం జరిగింది. ఈ విషయాన్ని మాజీ శాసనసభ్యులు వివరించగా వారు మన ఇంచార్జ్ దృష్టికి తీసుకువెళ్లి వైద్య ఖర్చుల కోసం 2 లక్షల 50 వేల రూపాయల (ఎల్ ఓ సి) కాపీని అందజేయడం జరిగింది.ఎల్ ఓ సి ని మంజూరు చేసి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు జి.విఠల్ రెడ్డి .ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు,దాగం సర్పంచ్ గాడేకర్ సాయినాథ్, పిక్కల్కర్ గోవింద్, రాజు, మీనాజీ , బాలాజీ పి, రాము, హల్ద సర్పంచ్ దేవేందర్ మరియు తదితరులు ఉన్నారు.