కార్యక్రమంలో పాల్గొన్న బిజినపల్లి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఎమ్ నవీన్ కుమార్
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్
బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో బిజినపల్లి ఎస్బిఐ శాఖ వారు ఈరోజు ఉదయం గ్రామపంచాయతీ దగ్గర కేవైసీ డ్యూ ఉన్న ప్రతి ఖాతాదారుడు రీ కేవైసీ చేసుకోవలసిందిగా బ్యాంకు మేనేజర్ ఎం నవీన్ కుమార్ సూచించారు. అలాగే ఫీల్డ్ ఆఫీసర్ ఫరూక్ భాష మాట్లాడుతూ క్రాప్ లోను తీసుకున్న రైతులు సకాలంలో రెన్యువల్ చేసుకున్నట్లు అయితే గవర్నమెంట్ తరఫున మూడు శాతం సబ్ స్టేషన్ వస్తుంది. అలాగే మహిళా సంఘాలు గ్రూపు లోన్స్ సభ్యులతో వారికి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ రాజు సులోమన్ గార్ల అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్ బుకింగ్ వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. అలాగే ఇన్సూరెన్స్ మేనేజర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వివిధ రకాల గవర్నమెంట్ స్కీముల గురించి వివరించారు. ఇట్టి కార్యక్రమంలో మినీ బ్యాంక్ సుభాష్ బ్యాంకు సిబ్బంది విష్ణువర్ధన్ ఆంజనేయులు రాము ప్రసాద్ జమీల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు