బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు..
పయనించే సూర్యడు // మార్చ్ // 10 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్: గ్రూపు1, గ్రూప్ 2, గ్రూప్3లతో పాటు అన్ని రకాల ఫలితాలు నిలుపుదల చేయాలని బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాక ముందే నేడు గ్రూప్1 ఫలితాలు ప్రకటించడం, అదేవిధంగా ఈనెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 అదేవిధంగా ఈనెల 17న హాస్టల్ వార్డెన్ ఆఫీసర్, ఈనెల 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిందన్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ జరగక ముందే అన్ని రకాల ఉద్యోగాలు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో మన ఎస్సీ వర్గానికి మొత్తం తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు ఆ చట్టం జీవో రూపంగా వచ్చి అమలు జరిగేంత వరకు గ్రూపు1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఎస్సీ రిజర్వేషన్ శాతం 15% ఉన్నదాన్ని 18 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టబద్ధత చేసే సమయంలో 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 18 శాతానికి పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నామన్నారు. అదేవిధంగా గ్రూపులో ఉన్న 15 కులాలు అన్ని రంగాలలో వెనకబడిపోయార, కనుక జనాభా ధమాస ప్రకారం కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన ప్రకారం మరో రెండు శాతం రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వేణు కోరారు. అదేవిధంగా ఏ గ్రూపులో ఉన్న 15 కులాలకు అన్ని రంగాలలో వెనుకబడిపోయారు కనుక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 15 కులాల్లో మేజర్ కులమైన బేడ బుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇచ్చి పదివేల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తూర్పాటి లింగయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాషా శివ, రాష్ట్ర కోశాధికారి డొక్కా రాజేష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వానరాశి వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం ముత్తు, చింతల అంజి, సిరిగిరి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.