▪హుజురాబాద్ డివిజన్ కళామండలి ఎంపిక.
▪డివిజన్ ఇంచార్జ్ మరియు నియోజకవర్గ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష...
పయనించే సూర్యడు //జనవరి 21//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్//కుమార్ యాదవ్..
మాదిగల హక్కులు సాదించుకోవడమే ధ్యేయంగా మంద కృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు - వేల గొంతులు కళా ప్రదర్శన ఫిబ్రవరి 7వ హైదరాబాద్ నడిబొడ్డున జరిగే కార్యక్రమానికి
హుజురాబాద్ డివిజన్ కమిటీ ని లక్ష డప్పుల వేల గొంతుల నియోజకవర్గ ఇంచార్జి , నియోజకవర్గ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష అద్వర్యం లో డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.హుజురాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా రాం శ్రీకాంత్ కమిటీ సభ్యులుగా ఉట్ల సంపత్ , ఇళ్ళందుల భద్రయ్య, నమిండ్ల సంపత్ హుజురాబాద్ మండల అధ్యక్షులుగా ఎర్ర శ్రీధర్, జమ్మికుంట మండల అధ్యక్షులుగా రామంచ రాజేందర్ ,ఇల్లంతకుంట మండల అధ్యక్షులుగా మేకల నరేష్, వీణవంక మండల అధ్యక్షులుగా అంబాల మధునయ్య లను ఎన్నుకోవడం జరిగింది..ఈ సందర్భంగా కళామండలి జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు)మాట్లాడుతూ.. హుజురాబాద్ డివిజన్ కమిటీ కి, వివిధ మండలాల అధ్యక్షులకు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఈనెల 22న లక్ష డప్పులు వేల గొంతులు కరీంనగర్ పెద్దపల్లి సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మందకృష్ణ మాదిగ రానున్నందున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే సభకు అధిక సంఖ్యలో డప్పు కళాకారులు కవులు మేధావులు, మాదిగ మాదిగ ఉపకులాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా లక్ష డబ్బులు వేల గొంతుల రాష్ట్ర కోఆర్డినేటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఇన్చార్జ్ రామంచ భరత్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర ఆదిత్య, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, ఎమ్మార్పీ సీనియర్ నాయకులు బోయిన సమ్మయ్య, కవి రచయిత చిట్యాల విజేందర్ (సివిఆర్ బౌద్ధ)
, కళామండలి జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీరామ్, రాచపల్లి ప్రవీణ్, కార్యదర్శి అందాస్ నారాయణ, జీడి మోహన్, అంబాల రాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.