
బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి:జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత బిజెపి నాయకులు కార్యకర్తలు పై ఉందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బోగస్ ఓట్లను తొలగించేందుకే ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని , ప్రతి ఒక్కరు ఎస్. ఐ. ఆర్. లో తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. గడుపులోగా బిజెపి పార్టీ బిఎల్ఎలు మరింత కృషి చేసి ఎస్. ఐ ఆర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పాటుపడాలన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి సంఘటన మంత్రి ప్రధాన చంద్రశేఖర్ జీ ను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావ్ ను ఎమ్మెల్యే తో పాటు, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్, స్వాగతించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు