
పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కార్తిక తొలి సోమవారం సందర్భంగా బనగానపల్లె మండలంలోని పలు శైవక్షేత్రాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల శివనామస్మరణలతో మార్మోగాయి
తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో శివాలయాలను ,క్షేత్రాలను సందర్శించి శివయ్యకు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. ప్రధానంగా ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి క్షేత్రానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పెద్ద పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించిన భక్త జనం క్యూలైన్లలో వెళ్లి ఉమామహేశ్వరులను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం గాలిగోపురం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో,ఆలయం ముఖ్య కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, యాగంటి పల్లె ఉపసర్పంచ్ బండి మౌళీశ్వర్ రెడ్డి ఆలయ సిబ్బంది భక్తుల రద్దీని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా క్యూలైన్ పర్యవేక్షణ జరిపి భక్తులకు గర్భాలయంలో స్వామివారి అభిషేకాలకు, స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తూ ప్రతిఒక్కరికి త్వరితగతిన స్వామివారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకై పెద్దకొనేరు నుండి మెట్ల మార్గంలో చలువ పందిళ్లు వేసి, దేవాలయ ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం, ప్రత్యేకంగా పులిహోర ప్రసాదాలను అందజేశారు.యాగంటిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు కార్తీక తొలి సోమవారం సందర్భంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మలు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పాండురంగారెడ్డి వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి దర్శనం అనంతరం శాలువతో సత్కరించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఎస్ కొత్తూరులో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతుల పూజలు కార్తిక తొలి సోమవారం సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు వేకువజామున పాణ్యం మండలం కొత్తూరు శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో రామకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అర్చకులచే తీర్థప్రసాదాలు,వేద పండితుల ఆశీర్వచనాలు అందచేశారు.,