14 సం, విభాగంలో లాంగ్ జంప్ పోటీలకు ఎంపికైన సాయి వర్షిత్
అభినందించిన బాబు నాయక్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ
( పయనించే సూర్యుడు అక్టోబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామం లోని విఐపి పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిత్ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ అండర్ 14 సం, ల పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఎస్ జి ఎఫ్ డిస్టిక్ స్థాయి పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచడంతో తదుపరి పోటీలకు అర్హత సాధించినట్లు వీఐపీ స్కూల్ పిఈటి బాబు నాయక్ మీడియాకు తెలిపారు. త్వరలో జరిగి రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా గెలుపొంది జాతీయస్థాయి పోటీలో రాణించడమే లక్ష్యమని ఎంపికైన క్రీడాకారుడు సాయి వర్షిత్ అన్నారు. విద్యార్థి సెలెక్ట్ కావడంతో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ మరియు పీఈటి రాజన్ నాయక్ మరియు ఉపాధ్యాయుల బృందం విద్యార్థికి అభినందనలు తెలిపారు.