(NEP)నూతన జాతీయ విద్య విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి
తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 07 షాద్నగర్ నియోజకవర్గం ఇంచా ర్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )షాద్నగర్ నియోజకవర్గ ముఖ్య కడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు జాతీయ సమితి సమావేశాల కరపత్రాలను ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఫిబ్రవరి 9..10.. సమావేశాలు ఉంటుందని 9వ తేదీన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరుగుతుంది.ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి హాజరువుతున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులపై మతతత్వ భావజాలాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తుందని, విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు.అంబేద్కర్, భగత్ సింగ్, పెరియర్ మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల నుండి తొలగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం బడ్జెట్లో విద్య రంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు, గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం హాస్టల్లో అమలు చేయడం లేదని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని పవన్ చౌహన్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిలు శివకుమార్ ఆకాష్ నాయక్ ఆమీర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు