సర్పంచ్ తన పొలం నుండి నీళ్లు ఇవ్వాల్సిన దుస్థితి క్రాంట్రాక్టర్ కన్నీలు చెల్లింపులు గాలిలో “మాజీ ఎమ్మెల్యే మాటలు గాలి మాటలే గ్రామ యువకుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
( పయనించే సూర్యుడు మార్చి 17 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం లక్ష్మీదేవుని పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఓటేయడానికి అంగీకరించారు. ఊరిని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో, మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీపై నమ్మకం ఉంచారు. ఆయన తేల్చి చెప్పిన మాట— “ఏకగ్రీవం చేస్తే ఎమ్మెల్యే నిధులతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి రూ. 25 లక్షలు ఇస్తాం.” అని చెప్పి ఎన్నికలు ముగిసాక ఆ మాట గాలిలో కలిసిపోయింది. నిధులు రాలేదు.. నిరాశలో గ్రామం ఎన్నికల అనంతరం ఊరి అభివృద్ధికి ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం ఇచ్చే నజరానా కూడా రాకపోవడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం తీవ్ర నిరాశలో ఉంది. పంచాయతీకి ఫండింగ్ లేకపోవడంతో చాలా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఒకానొక సందర్భంలో మిషన్ భగీరథ కింద నీళ్లు రావాల్సి ఉండగా, రాకపోవడంతో ఊరి ప్రజలకు కనీసం త్రాగునీళ్లు కూడా అందకపోవడంతో సర్పంచ్ పసుపుల నర్సింలు వ్యక్తిగతంగా తన పొలంలోని బోర్ నుంచి పైప్లైన్ వేసి గ్రామానికి నీళ్లు అందించారు. నాయకులు మాట తప్పినా, తన ఇజ్జతను కాపాడుకునేందుకు సర్పంచ్ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రజా సేవకు, అభివృద్ధికి ప్రతి గ్రామానికి పంచాయతీ భవనం ఎంతో అవసరం. కానీ, భవనం నిర్మాణం నిధులు లేక అర్థాంతరంగా ఆగిపోయింది అంగన్ వాడి భవనాన్ని గ్రామ పంచాయతీ భవనం గా మార్చుకోని నడుపుతున్నారు.మహిళా సంఘం భవనం కూడా అదే పరిస్థితి కాంట్రాక్టర్ కన్నీళ్లు.. చెల్లింపులు గాలిలో
గ్రామంలోని రహదారుల పరిస్థితి మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఇద్దరు యువకులు దామోదర్,శివ ఐదులక్షలు, సర్పంచ్ నర్సింలు ఒక ఐదు లక్షలు రూపాయలతో సీసీ రోడ్డు పనులను స్వయంగా చేపట్టారు. మూడు సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వం ఆ చెల్లింపులను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ యువకులు, మరియు సర్పంచ్ డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకంతో ఎదురు చూస్తూ.. ఇప్పుడు మిత్తులు కట్టలేక నిలవలేని పరిస్థితికి వచ్చారు. ప్రజా సంక్షేమానికి హామీలు.. కానీ నిధులేమీ లేవు ఎన్నికల ముందు ఇచ్చే మాటలు, ఎన్నికల తర్వాత మర్చిపోతున్న రాజకీయ నాయకుల వైఖరి ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు, ఇప్పుడు కనీసం గ్రామస్థుల గోడును పట్టించుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు.గ్రామానికి న్యాయం జరగాలంటే ఎవరు ముందుకు వస్తారు? లక్ష్మీదేవుని పల్లి గ్రామ ప్రజలు తమ సమస్యలను ఎవరైనా పట్టించుకుంటారా? అనే అనుమానంలో ఉన్నారు. అభివృద్ధి పేరుతో హామీలు ఇచ్చి మరీ ఇలా మోసం చేయడం ఎంత వరకు సమంజసం? అని వారు వాపోతున్నారు దయచేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అయినా మా గ్రామాన్ని పట్టించుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు