పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20: ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ కనీస సౌకర్యాలు కల్పించని కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న గిరిజన బిడ్డలు ఆట స్థలం లేదు క్రీడా సామాగ్రి అందలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి గిరిజన ఏకలవ్య మోడల్ స్కూల్లో సమస్యలు పరిష్కరించాలి ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారేపల్లి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గిరిజన ఏకలవ్య మోడల్ స్కూల్ సమస్యలతో సతమతం అవుతుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏకలవ్య స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. కనీసం పాఠశాల నిర్మాణం 15 ఎకరాల పరిధిలో జరగాల్సింది 9 ఎకరాల్లో మంజూరు చేసి కనీసం విద్యార్థులకు ముఖ్యమైన ఆట స్థలం లేకపోవడంతో ఏకలవ్య మోడల్ స్కూల్ యొక్క ఉద్దేశం నిరుపయోగంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గిరిజన విద్య కోసం ఏకలవ్య విద్య అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తగిన స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ఆట వస్తువులు, బాలికలకు కనీస సౌకర్యాలు కల్పించడం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు. 53 మంది స్టాప్ ఉన్న వారందరికీ గృహ నిర్మాణం చేపట్టలేకపోయిందని, మారుమూల గ్రామం రేలకాలపల్లి ఉన్న అత్యవసర వైద్యం నిమిత్తం ఎటు పోవాలన్న సౌకర్యం లేదని వెంటనే ఒక డాక్టర్ తో పాటు అంబులెన్స్ వాహనం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండుసార్లు బట్టలు ఇవ్వాల్సింది ఇప్పటికి ఇవ్వలేదని, ఇచ్చిన షూస్ నాసిరకంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకూ నాసిరకం వస్తువులు సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. తిండి ఆహారాలు సరఫరా చేయటంలో కూడా నాణ్యత లేదని తమ పరిశ్రమలో తేలిందని ఆయన తెలిపారు. ఆట స్థలం తో పాటు ఆట సామాగ్రి, నాణ్యమైన విద్య అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్లో చాలా రూములలో ఫ్యాన్లు లైట్లు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని తాము స్వయంగా పరిశీలించామని తెలిపారు. విద్యార్థులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ తన్నీరు నాగేశ్వరావు తో తమ దృష్టికి వచ్చిన సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి మీ వంతుగా కృషి చేయాలని కోరారు. ఏకలవ్య మోడల్ స్కూల్ సమస్యలపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ సంబంధించిన అధికారులు జిల్లా కలెక్టర్ సందర్శించి ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చాలా చూపాలని ఆయన కోరారు లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఆందోళన పోరాటాలు చేసుకొని హెచ్చరించారు. పర్యటనలు ఆయనతోపాటు తెలంగాణ గిరిజన సంఘం కారేపల్లి మండల అధ్యక్షులు అజ్మీర శోభన్ నాయక్, ధరావత్ వినోద్ నాయక్, రణ దేవ్ తదితరులు పాల్గొన్నారు.