ఐటీడీఏ పీవో బి రాహుల్
పయనించే సూర్యుడు మే 15 (పొనకంటి ఉపేందర్ రావు )
2025 -26 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలో మొత్తం 08 (భద్రాద్రి కొత్తగూడెం-07 మరియు ఖమ్మం 01) తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాలలో నడపబడుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమునకు CBSE సిలబస్ లో MPC,BIPC,CEC,Humanities గ్రూపులలో ప్రవేశం పొందుటకు 2024- 25 వ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికల నుండి ఈనెల 16 నుండి 24 వ తేదీ వరకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ ఎం ఆర్ ఎస్ విద్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈఎంఆర్ఎస్ గండుగులపల్లి, గుండాల బాలికలకు ఎంపీసీ, సీఈసీ గ్రూపులకు, ఈ ఎం ఆర్ ఎస్ పాల్వంచ బాలికలు ఎంపీసీ, బైపిసి, సీఈసీ గ్రూపులకు, ఈ ఎం ఆర్ ఎస్ టేకులపల్లి బాలురు బైపీసీ, సీఈసీ గ్రూపులకు, ఈ ఎం ఆర్ ఎస్ దుమ్మగూడెం బాలురు మరియు బాలికలు ఎంపీసీ, బైపీసీ, Humanities గ్రూపులకు, ఈఎంఆర్ఎస్ చర్ల, ములకలపల్లి, సింగరేణి బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సిఇసి గ్రూపులలో ఖాళీలు కలవని ఆయన అన్నారు.దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థిని, అభ్యర్థులకు ఎంపిక పదవ తరగతిలో CGPA/CBSE మెరిట్ మార్పుల ఆధారంగా కౌన్సిలింగ్లో వారికి అడ్మిషన్ ఇవ్వబడునని, అట్టి కౌన్సిలింగ్ ఈనెల 26న ఉదయం 9 గంటలకు ఈఎంఆర్ఎస్ చర్ల@భద్రాచలం నందు నిర్వహించబడునని అన్నారు. కావున గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.