చింతూరు ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చి వేయండి.
ఆదివాసి చట్టాల అమలు, హక్కుల సాధన సదస్సులో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్.
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 25
శుక్రవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఆదివాసి చట్టాల అమలు హక్కుల సాధన అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ ((274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ఆదివాసి సమాజానికి ఏజెన్సీ లో 1/70 చట్టం గుండెకాయ లాంటిదని అటువంటి చట్టం ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతకానితనం వలన, ఏజెన్సీ లో పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యం వలన నీరు గారి పోతుందని, చదువుకుంటున్నా విద్యార్థులు మరియు చదువుకున్న మేధావులు అందరూ ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక చట్టాలు తెలుసుకొని వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఏజెన్సీలో 1/70 చట్టం ఉల్లంగించబడుతుంది కనుకనే బయట ప్రాంతాల నుండి నాన్ ట్రైబల్స్ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని ఇది ఆదివాసి చట్టాల అమలపై ప్రత్యేకమైన ఆదివాసి సంస్కృతి పై ప్రభావం చూపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసి స్వతంత్ర సమరయోధులు ఆదివాసి పోరాట వీరులు త్యాగఫలంగా రాజ్యాంగంలో ఆదివాసులకు ప్రత్యేక స్థానం కల్పించబడిందని ఆదివాసులు రక్షణ అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని ఆ చట్టాలు ఏజెన్సీలో సరిగ్గా అమలు నోచుకోక ఆదివాసులకు రాజ్యాంగ హక్కులు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయని యువత ఆదివాసి చట్టాల అమలకై హక్కుల సాధనకై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. యువత ఉన్నత చదువుల్లో రాణిస్తూనే తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ భావితరాల ఆదివాసి సమాజం కోసం అస్తిత్వం కోసం చట్టాలను రక్షించుకోవాలని ఆయన తెలియజేశారు. ఆదివాసి సమాజం ఆదమరసి ఉండటంవల్లనే ఆదివాసులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో నెంబర్ 3 పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఇప్పుడు ఏజెన్సీలోకి అక్రమంగా చొరబడ్డ గిరిజనఏతరులు ఆదివాసి సమాజానికి ఆయు పట్టు అయినా 1/70 చట్టాన్ని తొలగించుటకు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు వచ్చిన ప్రతి అధికారికి ఆదివాసి చట్టాలు అమలు చేయండి అని దరఖాస్తులు పెట్టుకోవటం సరిపోతుందని ఏ ఒక్క అధికారి కూడా ఆదివాసి చట్టాలను ఏజెన్సీలో పగడ్బందీగా అమలు చేసిన సందర్భంగా లేవని ఆయన విమర్శించారు . ఆదివాసి రిజర్వేషన్లతో గెలిచిన ఆదివాసి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు కూడా నాన్ ట్రైబల్స్ పక్షానే ఉంటున్నారని ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్ల కోసం ఆదివాసుల దగ్గరకు వస్తారని ఆ తర్వాత ఆదివాసులు గుర్తుండరని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చే వరకు ఆదివాసి సంక్షేమ పరిషత్ కొనసాగిస్తున్న పోరాటంలో ఆదివాసి విద్యార్థులు ప్రజలు ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం చింతూరు మరియు చింతూరు డివిజన్లో ని అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని చింతూరు ITDA కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం చింతూరులో గుర్తించిన అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని చింతూరు తాసిల్దార్ వారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది