గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి ఆదివాసి JAC వినతి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 26 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్ శనివారం నాడు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ యం. మల్లికార్జున నాయక్ ఐఏఎస్ గారు చింతూరు పర్యటించిన సందర్భంగా ఆదివాసి జేఏసీ, ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి జేఏసి చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అమలు చేయటం లో అధికారులు విఫలం అవుతున్నారని దీని మూలాన ఏజెన్సీ మొత్తం నాన్ ట్రైబల్స్ ఆక్రమిస్తున్నారని, అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని కావున 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలన్నీ తక్షణమే కూల్చివేయాలని కోరారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం అధికారులు నడుచుకోవడం లేదని అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రోడ్డు పక్కన ఉన్న కొన్ని అక్రమ కట్టడాలను తొలగించారని చాలా చోట్ల నోటీసులు ఇచ్చి తొలగించకుండా వదిలేశారని ఆయన అన్నారు. కచ్చితంగా న్యాయస్థానం ఉత్తర్వులు పాటించాలని ఆయన ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు మాట్లాడుతూ అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోని అధికారులకు, ఐటిడిఏ అధికారులకి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తమని తెలియజేసినట్లు ఆయన పత్రికలకు తెలిపారు. అనంతరం ఆదివాసి నాయకులతో జరిగిన చర్చ సమావేశంలో ఏజెన్సీ చట్టాలు పటిష్టంగా అమలు జరిగే వరకూ ఆదివాసీలందరూ సంఘటితంగా పోరాటం చేయాలని పోరాటం చేస్తేనే ఆదివాసుల రాజ్యాంగ పలాలు దక్కుతాయని ఆయన ఆదివాసి నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. ఏజెన్సీ చట్టాలను గౌరవ న్యాయస్థానాల ఉత్తరాలను అధికారులు సరిగ్గా పాటించుకుంటే ఆదివాసులందరినీ ఏకం చేసి దశలవారీగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ వైస్ చైర్మన్ శీలం తమ్మయ్య,జేఏసీ మండల కార్యదర్శి కాకా సీతరామయ్య,మడివి.రాజు,సోయం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు