
చింతూరు ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారిని కలిసిన ఆదివాసీ జేఏసీ డివిజన్ కమిటీ
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 9 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్ చింతూరు మండలంలో నాలుగు మండలాల్లో మరియు చింతూరు మండలంలో గిరిజనేతరుల వలసలు ఆమంతంగా పెరిగిన సందర్భంగా చింతూరు ఏజెన్సీలో LTR 1/59 మరియు 1/70 చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులకు భూమి హక్కు గాని గృహ నిర్మాణాలు గానీ,ఎటువంటి అనుమతులు ఉండవని అటువంటి వారికి కరెంట్ మీటర్లు మంజూరు చేయడం ఆపాలని చింతూరు ఎర్రంపేట కరెంట్ ఆఫీసులో ఏఈ గారికి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసినదే ఆ విషయమై కొంత మంది గిరిజన నేతరులు కరెంటు సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదంటూ ముందుగా ఏజెన్సీ ఏరియాలో ఆదివాసి చట్టాల గురించి అవగాహన పరుచుకొని మాట్లాడాలంటూ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన గిరిజనేతరులు 19 70 తర్వాత ఎవరైతే ఉంటారో వారికి గిరిజన ప్రాంతాలలో అన్ని రకాల అనుమతులు పూర్తిగా నిషేదాoటూ చింతూరు డివిజన్ ఆదివాసి జేఏసీ చైర్మన్ జల్లి.నరేష్ వైస్ చైర్మన్ కారం. సాయిబాబు మండల ఆదివాసి జేఏసీ చైర్మన్ పోడియం. రామకృష్ణ వైస్ చైర్మన్ కాకా సీతారామయ్య వైస్ చైర్మన్ కారం.చంద్రయ్య వేగి తోట పేసా కమిటీ సభ్యుడు తుర్రం సుబ్బయ్య పిఓ గారిని కలిసి ఏజెన్సీ చట్టాలను పగడ్బందీగా అమలుపరిచే విధంగా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కరెంటు ఆఫీసులకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ చింతూరు డివిజన్ ఆదివాసి జేఏసీ తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది.
