తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీగౌడుకుల పరిరక్షణ కమిటీరాష్ట్ర నాయకులు పిలుపు
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు : ఇల్లందు మండలం ముకుందాపురం లో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ పరిరక్షణ కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు మండల స్థాయి ఏజెన్సీ గౌడుకులస్తుల ఆత్మీయ సమ్మేళన సదస్సు జరిగింది, ఈ సదస్సుకు అధ్యక్షులుగా శ్రీరామ్ కోటయ్య పబ్బు శ్రీను, ఆయిలు నారాయణ అధ్యక్షతన జరిగినది, ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ రాష్ట్ర కన్వీనర్ నరాటి వెంకటేశ్వర్లు, కొత్త వెంకటేశ్వర్లు, బంధం నాగయ్య, హజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం 342 5 వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ గౌడ్ కులస్తులు ఆదివాసీలుగా నమోదయి ఉన్నారు, కానీ అధికారులు పాలకులు కుమ్మక్కై ఏజెన్సీ గౌడ్లకు ఇవ్వాల్సినటువంటి ఆదివాసి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటం లేదు, అదే విధంగా కొంతమంది స్వార్థపరులు ఏజెన్సీ గౌడులకు ఉన్నటువంటి సొసైటీలను నిర్ధాక్షణంగా రద్దు చేయడం జరిగినది ఆనాటి నుండి ఏజెన్సీ ప్రాంతంలోని గౌడులు జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయి, ఒకపక్క ఏజెన్సీ గౌడులను బీసీ లో జాబితాలో చేసి బీసీలకు అందే అటువంటి సంక్షేమ పథకాలు కూడా అందకుండా మరో పక్కా ఏజెన్సీ గౌడ్లు ఎస్టీలను ఎలాంటి సంక్షేమ పథకాలు అందని వ్వకుండా. ఏజెన్సీ గౌడు కులస్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు,అసలు. ఏజెన్సీ గౌడుకులస్థులు ఎస్టీ లేదా. బిసిల జాబితానా. అధికారులు పాలకులు తెల్చకుండా , గందర గొలం సృష్టిస్తున్నారు,అందుకే ఏజెన్సీ గౌడుకులస్థుల ఉప్పొంగిన ఉద్యమస్పూర్తీతో హజరై ఈ సదస్సును విజయవంతం.చేసారు, ఇదే ఉద్యమస్పూర్తీ మన హక్కుల సాధన కై గమ్యం చేరేవరకు. ఇదే చైతన్యంతో గమ్యాన్ని ముద్దాడలని పిలుపు నిచ్చారు, ఈకార్యక్రమము లో,తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడుకుల పరిరక్షణ కమిటి నాయకులు మొడెం వెంకన్న,బసవ వెంకటేశ్వర్లు, ఉమ్మాగాని సత్యం, రేసు ఏల్లయ్య, బత్తినిసాయన్న, బత్తిని రాంమూర్తీ, యాసారపు తిరుపతి ,ఇల్లందు మండలం ఇల్లందు టౌను రొంపెడు, కొమరారం, పొలారం , దర్మాపురం, కొల్లాపురం, గుండాల, ఆళ్లపల్లి, మర్కొడు, బయ్యారం, మండాలలాల, గౌడుకుల పెద్దలు, మరియు మహిళలు. అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేసారు.