పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 22
ఆదివాసీలకు రక్షణ కవచమైన ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ మైదాన ప్రాంతాల నుండి 1970 తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలసలు వచ్చి స్థిర నివాసాలు, అక్రమ కట్టడాలు, వ్యాపారాలు నిర్మించుకుని ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడిచిన నాన్ ట్రైబల్స్ కు పోలవరం ప్యాకేజీ ఎందుకు ఇవ్వాలి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? చట్ట విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతం లోకి చొరబడి ఆదివాసి చట్టాలను నీరుగారచడమే కాకుండా ఆదివాసి సంస్కృతిని ధ్వంసం చేసి నేడు ఆదివాసి భూభాగాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి పోలవరం ప్యాకేజీ ఇవ్వటం అంటే ప్రభుత్వం అక్రమాలను ప్రోత్సహించినట్లే అని ఆయన విమర్శించారు. అక్రమ దారులకు కోట్లాది రూపాయలు ప్యాకేజీ ఇవ్వటం వలన ప్రజాధనం వృధా చేయడమే అవుతుందని ఆయన అన్నారు. పోలవరం నష్టపరిహారం చెల్లింపు విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఒక నాన్ ట్రైబల్ కుటుంబానికే ఐదు నుంచి పది రకాల నివాసాలు ఉన్నట్టు వ్యాపారాలు ఉన్నట్లు నమోదు చేసుకుని తప్పుడు పద్ధతిలో ప్రభుత్వాన్ని మోసం చేసి ప్యాకేజీ పొందాలని వలస నాన్ ట్రైబల్స్ కుట్రలు చేస్తున్నారని, ఈ తప్పుడు తడకల్లో కమిషన్ కోసం అధికారులు కూడా కక్కుర్తి పడి నాన్ ట్రైబల్స్ నీ అక్రమ మార్గంలో పిడిఎఫ్ లిస్టులో నిన్న మొన్న ఏజెన్సీలో చొరబడ్డ వాళ్లకు కూడా నమోదు చేరుస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఇచ్చిన పునరావాస ప్యాకేజీ లో కూడా ఇటువంటి తప్పులు దొర్లాయని అయితే ప్రస్తుతం ఇవ్వబోతున్న ప్యాకేజీలు మాత్రం భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇప్పటి కైనా ప్రభుత్వం మేల్కొని ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పోలవరం ముంపు ప్రాంతంలోకి వలసలు వచ్చిన వాళ్లకి మరియు పోలవరం ప్యాకేజీ కోసమే ఈ మధ్యకాలంలో పోలవరం ముంపు ప్రాంతంలో అక్రమ కట్టడాలు కట్టి వాటన్నిటినీ పిడిఎఫ్ లిస్టులో చేర్చిన నాన్ ట్రైబల్స్ నీ గుర్తించి తొలగించాలని, తప్పుడు పద్ధతులు పిడిఎఫ్ లిస్టులో చేర్చిన అధికారులపై పిడిఎఫ్ లిస్టులో చేరిన నాన్ ట్రైబల్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఆదివాసులకు మరియు పూర్వం నుండి ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నటువంటి నాన్ ట్రైబల్స్ కు మాత్రమే పోలవరం ప్యాకేజీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధికారులు మరియు కొంతమంది నాన్ ట్రైబల్స్ చేస్తున్న ఈ కుట్రలపై సి బి సి ఐ డి తో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు