ఆక్రమణాల తొలగింపు వెంటనే మొదలు పెట్టకపోతే మరో ఆదివాసీ ఉద్యమం తప్పదు
ఆగస్టు 8 చలో మారేడుమిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని ప్రకటించాలి.
ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా డిమేండ్….
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,ఆగస్టు04
1/70చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో గిరిజనేతర అక్రమ కట్టడాల కూల్చివేతలు,గౌరవ సుప్రీంకోర్టు రోడ్డుకు ఇరువైపులా 50 మీటర్లు ఆక్రమణలు కూల్చివేయాలని తీర్పు ఇచ్చి ఉన్నది.రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతంలో కూల్చివేతల విషయంలో హడావుడి చేసిన అధికారులు మిగిలిన మండలాల్లో కూల్చివేత ప్రక్రియ ఎందుకు చేయడం లేదని ఈ మౌనాన్ని బట్టి చూస్తుంటే గిరిజనేతర సమాజం నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినయేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఆదివాసి జెఎసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా అధికారుల తీరు పై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు సభలో జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అలాగే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా 5వ షెడ్యూల్ భూభాగం ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తేదీన మారేడుమిల్లి మండలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముందంజ ఉత్సవ కార్యక్రమం సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు శ్రేయోభిలాషులు ఆదివాసి మేధావులు వివిధ ఆదివాసి సంఘాల నాయకులు ఆదివాసి సమాజం భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సున్నం.రాజశేఖర్, మదల.చంటి,కుంజా.విజయ్, కుంజా.నాగేశ్వరావు,బేతి.ముత్తయ్య, పూసం.వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.