
రైతులను ఆదుకుంటాం !!
పయ నించే సూర్యుడు : మార్చి 17: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండలం తీర ప్రాంత సమీపంలో ఉన్న వరిచేలు సముద్రపు నీరు
పోటు ఎత్తడంతో పండడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిళ్ళుగా ఇదే పరిస్థితి రావడంతో పండించడం మానేశారు. మంగళవారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రైతులకు హామీ ఇచ్చారు. పాడైపోయిన షట్టర్ ప్రాంతంలో కొత్త షటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏటుగట్టు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశామని, అది పూర్తి అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేయడానికి మరో 10 కోట్లు తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏటిగట్టు ఆక్రమణలను తొలగించి హెడ్ వర్క్స్ కు అప్పచెప్పాలని తాసిల్దార్ రవికిరణ్ ను ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం సత్తమ్మ చెట్టు ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పిల్లలకు పెడుతున్న ఆహారాన్నిపరిశీలించారు. ఆయన ఆహారాన్ని రుచి చూశారు. సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కాట్రేనికోన హైస్కూల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను పరిశీలించారు. వెంటనే వాటి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, నీటి సంఘం డైరెక్టర్ వాసంశెట్టి రాజేశ్వరరావు, కాట్రేనికోన మండల టిడిపి యూత్ అధ్యక్షుడు వంగా దుర్గ బాబు, టిడిపి నాయకులు పచ్చమట్ల సూర్యనారాయణ రాజు, విత్తనాలు వెంకటరమణ, వనసర్ల నాగేశ్వరరావు, శీలం సూర్యనారాయణ, జంగా శ్రీనివాసరావు, బండారు ఏసు, నల్ల రామకృష్ణకదలి కార్యక్రమంలో పాల్గొన్నారు.
