పయనించే సూర్యుడు; జులై 03: ములుగుజిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా కలెక్టర్ డాక్టర్ దివాకర టీ.ఎస్.మరియు జిల్లా ఆరోగ్య అధికారి ఆదేశాలమేరకు గురువారం వాజేడు మండలం లోని పంచాయతీ ఎడిజర్లపల్లిగ్రామంలోప్రగల్లపల్లి పల్లె దవాఖాన వైద్య అధికారి గ్యానస ఆధ్వర్యంలో ముత్తారం గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగినదని,ఇంటింటికి వెళ్లి బాలింతలను,గర్భవతులను ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందనీ పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ గ్యానస తెలిపారు. అనంతరం అంగన్వాడి సెంటర్ నందు వైద్య శిబిరం నిర్వ హించడం జరిగిందనీ ఈ శిబిరానికి ఏటూరు నాగారం ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్వో కోరం క్రాంతి కుమార్ సందర్శించటం జరిగిందని తెలిపారు.శిబిరంలో కనితితో ఉన్న వ్యక్తిని పరిశీలించి,సిహెచ్ఎంసి ఏటూరు నాగారం రిఫర్ చేయడం జరిగిందనీ అలాగే గ్రామస్తులకు వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నీరు కాచి చల్లార్చినగ తాగాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికి కుండలలో దోమలు నివాసం లేకుండా చూసుకోవాలని,ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగినదని తెలియజేశారు. అంతేకాకుండా ఏడిజెర్లపల్లి పాతూరులో వైద్య సిబ్బంది మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో వారి సిబ్బంది మురికిగుంటలో ఆయిల్ బాల్స్ వేసి ఆశ కార్యకర్తలతో తిమో పాస్ ముందు చల్లడం జరిగిందనీ వివరించారు.ఈ యొక్క కార్యక్రమంలో రెండు గ్రామాలలో వైద్య పరీక్షలు చేసుకున్న వారి సంఖ్య.94 కాగా గర్భవతులు ముగ్గురు. గర్భవతులను శుక్ర వారం వైద్య పరీక్షల నిమిత్తం ఏటూరి నాగారం 102 వాహనంలో ఆశా కార్యకర్త తీ సుకొని వెళ్ళ మని తెలిపామని అన్నారు.రక్తపూత సేకరణ,ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు మరియు వాటిని నెగటివ్ గాఉన్నాయని తెలిపారు. మధుమేహం,రక్త పోటు వారికి నెలసరి మందులు అందజేసామని తెలిపారు.ఈయొక్క కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కోరం కాంత్ కుమార్, పల్లె దవాఖాన వైద్య అధికారి గ్యానస,సబ్ యూనిటీ అధికారి వాసు, నరసింహ రావు, పంచాయతీ కార్యదర్శి కార్తీక్, మరియు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు. అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగిందనీ తెలియ జేశారు.