
తెల్లవారు జామున మార్నింగ్ వాక్ తో మొదలు పెట్టి రాత్రి వరకు ప్రచారం.
నాయకుణ్ణి కాదు సేవకున్ని అనే నినాదం తో ముందుకు.
పయనించే సూర్యుడు, డిసెంబర్ 3, అశ్వాపురం,అశ్వాపురం పంచాయతీలో
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సదర్ లాల్ ప్రచారంలో తనకలవాటైన ముద్రతో దూసుకు వెళ్తున్నారు.ప్రతీ వార్డు తిరుగుతూ ఇంతకు ముందు పది సంవత్సరాల అవినీతి, బంధు ప్రీతి కి ఆస్కారం లేకుండా ఏవిధంగా నైతే గ్రామంలో అభివృద్ధి చేసామో అదే అభివృద్ధి కొనసాగిస్తామని, అభివృధి నే ఏకైక అజెండా గా ముందుకు సాగేందుకు గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని, ఈసారి అజెండా పంచాయతీ కి నూతన భవన నిర్మాణం, మిగిలిన అతికొద్ది రోడ్లు, మురుగు కాలువల డ్రెయిన్లు అని తెలుపుతూ ప్రజలకి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,వార్డు అభ్యర్థులు వేములపల్లి అశ్రిత,కొమరం కౌసల్య,గుర్రం త్రివేణి, చిట్టూరి భాస్కర్, నూకల లింగయ్య,సవలం అనిల్,నాయకులు వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు,తాడబోయిన వెంకటేశ్వర్లు,వలబోజు మురళీకృష్ణ, టీ డీ పి వాసు,ఇలాసాగరపు వరప్రసాద్, హరీష్, చుంచు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
