
పయనించే సూర్యుడు జూన్ 20 (సూళ్లూరు పేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా తడ మండలం భీములవారిపాలెం గ్రామంలో కేఎస్ దాస్ ప్రమాదం ద్వారా మరణించడం జరిగింది. సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ అయిన మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము.పీఎంజెజెబివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ద్వారా రూ. 2 లక్షల రూపాయలు ఆయన భార్య సుధా కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపిఎం రాజా రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో ఏపిఎం రాజా రెడ్డి, సీసీ జనార్దన్, మురళి, వెంకటేశ్వర్లు , స్వర్ణలత మరియు తిరుపతి డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సతీష్ , సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.