పయనించే సూర్యుడు న్యూస్ రాజంపేట ఫిబ్రవరి 12: మంగంపేట ఏపీఎండీసీ పాఠశాలలో పని చేస్తున్న కార్మికులను అరెస్టు చేయడం దుర్మార్గమని సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, పందికాళ్ళ మణి డిమాండ్ చేశారు. బుధవారం పాత బస్టాండ్ లోని సిపిఎం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురూ మాట్లాడుతూ మంగంపేటలో ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో హౌస్ కీపింగ్ స్కావెంజర్స్ గా పనిచేస్తున్న 16 మంది కార్మికులకు మూడు నెలలు జీతాలు అడిగినందుకు విధుల్లో నుంచి తొలగించి వాళ్లు గత 16 రోజుల నుండి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే మంగంపేట యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని ఎటువంటి చర్చలు జరపకుండా కనీసం మహిళలు అని చూడకుండా పోలీసులు చేత అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా యజమాన్యం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని, తక్షణమే యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకొని మూడు నెలల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోటో రైటప్ :సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్, మణి..