
పయనించి సూర్యుడుD.15.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.బాల్కొండ నియవర్గంలో ఏర్గట్ల మండల కేంద్రంలో80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్లలో స్వాతంత్ర్య వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు.ముందుగా పాఠశాల నుండిగ్రామం మొత్తం విద్యార్థులచే ప్రభాతభేరి నిర్వహించి ఆ తర్వాతపాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి మరియు గ్రామ పెద్దలు వీడిసి సభ్యులు కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగపలాన్ని గుర్తించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, దేశ సేవలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల కళా ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ కమిటీ సౌజన్యంతో బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ వీడిసి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.