
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలంలోని తడపాకల గ్రామం చివర్లో అక్రమంగా నిలువ చేసిన భారీ ఇసుక డంపు రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు 45 ట్రిప్పుల ఇసుకను గుర్తించినట్టు తాసిల్దారు మల్లయ్య తెలిపారు ఇసుక నిలువ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయబడును