
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలం గుమ్మిరాల గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి మంగళవారము సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో భాగంగా మండల రెవెన్యూ పరిశీలకులు ఆర్ ఐ, గ్రామ రెవెన్యూ సహాయకులు గుమ్మిరియాల గ్రామంలో గస్తీ చేయుచుండగా ప్యాక్స్ గోదాం ప్రాంతంలో అక్రమముగా నిలువచేసిన 8 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపు గుర్తించడమైనది. అక్కడినుండి గుమ్మిరియాల గ్రామము బ్రిడ్జి క్రింద వాగు వద్దకు వెళ్ళగా అక్కడ 2 ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లు గుర్తించి పట్టుకోవడం జరిగినది.ఇసుక డంపు మరియు 2 ట్రాక్టర్లు తహసిల్దార్ మల్లయ్య స్వాధీనం చేసుకొని సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తము పోలీస్ స్టేషన్ ఎర్ గట్లలో అప్పగించడం జరిగినది. ఎరుగట్ల మండలం అక్రమ ఇసుక రవాణా పూర్తిగా అరికట్టేందుకు నిరంతరం గస్తీ నిర్వహిస్తామని తెలిపారు ఇలాంటి అక్రమ కార్యక్రమంలో పాల్గొనే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
