

పయనించే సూర్యుడుD.12.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ .4,200 కుటుంబాలకు*లబ్ధి.. 306.16 క్వింటాళ్ల
అదనపు బియ్యం రేషన్ కార్డులు .. ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ మండల సమావేశంలో శివకుమార్ వెల్లడిఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు మొత్తం 1,419 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ తెలిపారు.ఏర్గట్లకు 550, దోంచందకు 75, గుమ్మిర్యాల్‌కు 150, తడపాకల్‌కు 190, బట్టాపూర్కు 132, తోర్తికి 150, తాళ్లరాంపూర్‌కు 132, నాగేంద్రనగర్‌కు 40 కార్డులు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పాత రేషన్ కార్డుల్లో మరో 1,500 మంది కుటుంబ సభ్యులను అదనంగా చేర్చినట్లు తెలిపారు. మొత్తంగా మండలానికి సుమారు 306.16 క్వింటాళ్ల అదనపు బియ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ఖర్చు లేకుండా మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు మంజూరు చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కుటుంబ గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని, ప్రభుత్వంఅందించే పలు సంక్షేమ పథకాలతో అనుసంధానం అవుతుందని తెలిపారు.401 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు మొదటి విడతలో ఏర్గట్ల మండలానికి 401 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 313 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని శివకుమార్ తెలిపారు. ఇళ్లు నిర్మించుకోలేమని తెలిపిన లబ్ధిదారులను తొలగించి, వారి స్థానంలో మరో 88 ఇళ్లు కొత్తగా మంజూరు చేసినట్లు వెల్లడించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు లబ్ధిదారుల జాబితాను పంపించారని, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో ఆమోదం పొందేలా చర్యలు తీసుకున్నామని, త్వరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. ఇళ్లు లేని అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డులతో గ్రామపంచాయతీ లేదా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి సర్ రెండో విడతలో భాగంగా ఓటర్లకు నోటీసులు అందుతున్నందున కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని శివకుమార్ సూచించారు.బి ఎల్ ఓ ల ద్వారా అందిన నోటీసులకు అవసరమైన ఆధారాలు సమర్పించి అర్హులైన వారి ఓటు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాపాలన 1,000 రోజుల సందర్భంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, కేఎంసీ డైరెక్టర్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.