పయనించే సూర్యుడు జనవరి 29 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూరు ఏజెన్సీ శ్యాంపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (పశువుల డాక్టర్) రమేష్ రాథోడ్ ఏసీబీ వల కు చిక్కారు బుధవారం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రికార్డులను పరిశీలిస్తున్నారు.డ్యూటీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఉదయ నాయక్ తండాలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేసిన జుగ్నాక మాధవ్ ఇటీవల బదిలీ అయ్యారు తన ఉద్యోగ విధులకు సంబంధించి రెండు నెలల డ్యూటీ సర్టిఫికెట్ కు జారీ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాథోడ్ రమేష్ ను సంపద్రించారు ఇందుకు రూ.15 వేలు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ చేస్తానని చెప్పారు దీంతో మాధవ్ ఏసీబీ అధికారులను ఆశ్ర యించారు ఆయన కుమారుడు జుగ్నాక గంగాధర్ ద్వారా రూ.15 వేలు లంచం ఇస్తుండగా అసిస్టెంట్ సర్జన్ రాథోడ్ ర మేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.