కళాశాల ప్రిన్సిపాల్ కె. లక్ష్మినారాయణ
పయనించే సూర్యుడు ఫిబ్రవరి12 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు ఏ ఎన్ కె డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో వున్న నిరుద్యోగ యువతీ యువకులు కొరకు ఏ ఎన్ కె డిగ్రీ కళాశాల ,కసి రెడ్డి పల్లి, కదిరి రోడ్ శ్రీ సత్య సాయి జిల్లాయందు13-02-2025 వ తేదీన జాబ్ మేళా నునిర్వహిండంజరుగుతుంది13-02-2025 వ తేదీన 6 కంపెనీల కొరకు ఉద్యోగమేళానిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి 10 తరగతి ఇంటర్ మరియు డిప్లమా, డిగ్రీ,పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉన్న వారు అర్హులు అని తెలియజేశారు. వీరికి నెలకు 12,000-20,000 రూపాయలు వరకు జీతం ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు శ్రీ సత్య సాయి జిల్లా, బెంగళూరు లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇంటర్వ్యూ కి హాజరయ్యే అభ్యర్థులు తమ బయో డేటా తో పాటు , ఆధార్ కార్డ్, విద్యార్హత పత్రాలు తీసుకొని ఉదయం తొమ్మిది గంటలకి హాజరు కాగలరని తెలిపారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగ మేళా కి హాజరై ఉపాధి పొందగలరని కళాశాల ప్రిన్సిపల్ కె. లక్ష్మి నారాయణ మరియు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్యా అధికారి బి. హరి కృష్ణ తెలియజేసారు.ఇంటర్వ్యూ కి హాజరయ్యే వారు ఈ క్రింది లింక్ లో రిజిస్టర్ చేసుకో గలరు https://naipunyam.ap.gov.in/user-registration ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించగలరు 7702002059 .