
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో గ్రామదేవత శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి ఆలయం వద్దకు వెళ్లే రహదారిని గ్రామస్థులే తమ సొంత డబ్బులతో నిర్మించుకున్నారు.
దాదాపు రెండు వందల కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో, గత పది సంవత్సరాలుగా రోడ్డు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ప్రజలే ముందుకొచ్చారు.దేవస్థానం వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలికంగా అయినా రహదారి నిర్మించుకోవాలని నిర్ణయించారు.గ్రామస్థుల ఐక్యతతో స్వచ్ఛందంగా నిధులు సమీకరించి రహదారి పనులు పూర్తి చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.రోడ్డు సౌకర్యం కలగడంతో దేవస్థానం వద్దకు భక్తులు సులభంగా చేరుకుంటున్నారు.ఈ నెల 21 నుంచి 26 వరకు చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.కొత్తగా నిర్మించిన రహదారి వల్ల ఉత్సవాలకు మరింత ఊపు వచ్చింది.భక్తులు విధి తీపలతో, బాణాసంచా మధ్య ఆనందంగా వేడుకల్లో పాల్గొంటున్నారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, చెంగలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
