
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 30 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్ చింతూరు మండలం ఎర్రంపేట గ్రామ వాస్తవ్యుడు మడివి. రాజు s/o తమ్మయ్య తనకు సంబంధించిన భూమిని పరిటాల సత్యనారాయణ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు ( ఇంటి నిర్మాణము మరియు షాపులు)జరిగాయని చింతూరు డివిజన్లో ఉన్నటువంటి మండలంలో గ్రామాలన్నీ ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి చెందినవి ఈ ప్రాంతాలలో 1/59 ఎల్.టి.ఆర్ చట్టం మరియు 1/70 అమలు అవుతున్న గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు ఏ రకంగా అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారం చేస్తూ గిరిజన భూములు అన్యాక్రాంతానికి ఏ రకంగా గురి కాగలుగుతున్నాయి. ఈ విషయంపై ఐటీడీఏ లో ఏర్పాటు చేసిన ఎల్. టి.ఆర్ విభాగానికి తనకు న్యాయం చేయమని ఈ రోజున ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి. నరేష్ డివిజన్ ప్రచార కార్యదర్శి.సోడి.శ్రీను మండల జేఏసీ చైర్మన్ పి. రామకృష్ణ, మడివి.రాజు, రాఘవయ్య, సంజీవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.