పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 1 ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో
భూ ఆక్రమణలకు అధికారులే అవకాశం ఇస్తున్నారని,అలాంటి ఆక్రమణలకు అవకాశం ఇవ్వొద్దు కలెక్టర్ గారు అని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు కోరారు.ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా స్థలం ఆక్రమించి షాపులు,షాపింగ్ కాంప్లెక్స్‌లు,గృహాలు నిర్మించారని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు జారీ చేసారు.ఆ ఆదేశాలను రెవెన్యూ అధికారులు బేఖాతరు చేస్తూన్నారని,హైకోర్ట్ ఆదేశాలు అనుగుణంగా ఫారం 5,ఫారం 6 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, కొన్ని మండలాలలో ఫారం 5 ఇచ్చి,ఫారం 6 ఇవ్వకుండా బేరాలు మొదలు పెట్టారు.ముఖ్యంగా కొయ్యూరు, చింతపల్లి,జికె వీధి,రాజవొమ్మంగి మండలాలలో ఫారం 6 ఇవ్వలేదని,ఫారం 6 ఇస్తే రెండు రోజుల్లో ఆక్రమణలు తీయాల్సి వస్తుందని,ఈ లోగా అధికారులు చేతులు తడుస్తున్నాయని, దాంతో రోడ్డుకి 50,50 అడుగులలో కొట్టాల్సి ఉండగా,కలెక్టర్ 35 అడుగులన్నారు.కొయ్యూరులో 15 అడుగులు, జికె వీధిలో 5 అడుగుల వరకు ఆక్రమణలు తొలగించాలని సంబంధిత రెవెన్యూ అధికారులు శెలవు ఇవ్వడంతో అక్రమణ దారులు అడ్డదారిలోనైనా అధికారులను కొనేయాలని చూస్తూ షాపుల ముందర పెక్సీలు తీసారు తప్పా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు.ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో భూబదాలయింపు నిషేధ చట్టం అమలు చేయవలసిన కలెక్టర్,రెవెన్యూ అధికారులు ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా 35 అడుగులవరకే ఆక్రమణలు తొలగించాలని చెప్పడం కరెక్ట్ కాదు.ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా గిరిజనేతరుడితో సమానమని సమత జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు చెప్పింది,ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంత అభివృద్ధి కొరకు పలు శాఖలకు కొంత భూమిని కేటాయించడం జరిగిందని,ఆ భూమిని ఆయా శాఖలు నిర్లక్ష్యం వహించడంతో ఆక్రమణ దారులు ఆక్రమించుకొన్నారు,ఆ భూమిని వెనక్కి తీసుకొని ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారిపై ఎల్టీఆర్ కేసులు పెట్టాల్సిన అధికారులు పాడేరులో 50,50 అడుగులు,చింతపల్లిలో 40,40 అడుగులు (డ్రైనేజీ తో కలిపి)కొయ్యూరు లో15,15 అడుగులు,జికె వీధిలో 5,5 అడుగులు ఆక్రమణలు తొలిగించి, మిగతా ఆక్రమణలు ఉన్నా పర్వాలేదని,వెనక్కి స్ధలముంటే ఆక్రమించుకొండని అభయమిచ్చినట్లు ఉంది ఈ వ్యవహారం.అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5 పంచాయతీలు తప్పా మిగతా భూభాగమంతా 5వ షెడ్యూల్డ్ ప్రాంతం కనుక అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే లేదంటే చినుకు చినుకు గాలివాన అయినట్లు ఆదివాసీల తిరుగుబాట్లు మొదలౌతాయని ,ఇప్పటికే ఈ ప్రాంతంలో యువత ముందుకు వస్తున్నారని,కలెక్టర్ రాజకీయ వత్తిళ్ళకు లొంగ కూడదని,ఈ ప్రాంతంలో ఐఎఎస్ అధికారుల మీద అపారమైన గౌరవం ఉందని,ప్రస్తుత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మీద ఆదివాసీలకు అపారమైన గౌరవం,నమ్మకం ఉందని,పదవులు లేని, పరువు లేని,సిగ్గులేని కొంతమంది రాజకీయ నాయకుల వ్యవహారం తెలిసిందే,వారిని పట్టించుకోకుండా కలెక్టర్ నిక్కర్స్ గా పని చేసి ఆదివాసీలతో శభాష్ అనిపించుకోవాలని ఆయన కలెక్టర్ ని కోరారు .