(పయనించే సూర్యుడు అక్టోబర్ 16 రాజేష్)
దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామం అంగన్వాడీ కేంద్రం లో సెక్టార్ లెవల్పోషణ మాసం ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎలయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు అంగన్వాడీ కేంద్రం/గ్రామ/సెక్టార్ స్థాయి లో పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి షెడ్యూల్ ప్రకారం జంక్ ఫుడ్ పై అవగాహన సమావేశం,అధిక బరువు - అవగాహన కార్యక్రమం ,అనుబంధ ఆహారం మొదలుపెట్టడం (అన్నప్రాసన) పై అవగాహన కల్పించడంపై అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని కోరారు.స్థానిక ఉత్పత్తులు పోషకాహార పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.అందరూ కూడా ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఆరోగ్య లక్మి పథకం ద్వారా అందిస్తున్నా గర్భిణీ స్త్రీలకు, బాలింత తల్లులకు ఒక పూట సంపూర్ణ భోజనం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషణ్ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ శ్యాంసన్, సూపర్వైజర్ గిరిజ మాట్లాడుతూ చిరుధాన్యాల అవసరాన్ని వివరించడంతో పాటు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. బాలికల్లో రక్తహీనత లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు, ఐరన్ చాలా ఉపయోగపడతాయని తెలిపారు. గర్భిణీ మొదటి రోజు నుండి- బేబీ 2 సంవత్సరాలు నిండే వరకు గల 1000 రోజుల ప్రాముఖ్యత,మరియు తీసుకోవలిసిన జాగ్రతల గురించి వివరించడం జరిగింది.
మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూగర్భిణీలకు, బాలింత తల్లులకు పరిశుభ్రత,ఆరోగ్య సలహాలు ఇస్తూ టీకాలు సరియైన సమయంలో తీసుకోవాలి అని తెలిపారు.
కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ లో భాగంగా పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు ప్రోగ్రాం చివరన సరైన పోషణ- ఆరోగ్య తెలంగాణ_పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు .అనే నినాదంతో ప్రోగ్రాం చివరగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఎల్లయ్య ,మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష ,పోషణ్ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ శ్యాంసన్, ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ గిరిజ, ఏఎన్ఎం స్వరూప, మెడికల్ స్టాఫ్ మమత , గ్రామ అంగన్వాడీ టీచర్లు మంజుల,సువర్ణ మరియు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు మరియు లబ్దిదారులు,గర్భిణీలు,బాలింతలు,పిల్లలు,తదితరులు పాల్గొన్నారు.