
పయనించే సూర్యుడు అక్టోబర్ 9 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు
:ఎన్నికల్లో నెగ్గడానికి భాజపా ఓట్ల చోరీకి పాల్పడిందని, దానికి వ్యతిరేకంగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టణ, మరియు ఇల్లందు మండలాలలోని ప్రతి గ్రామాలలో వందమంది నుంచి సంతకాలను సేకరించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షులు పులి సైదులు, పిఎసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గlమాట్లాడుతూ దేశంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడి కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ భాజాపాకు అనుబంధ సంఘంల పనిచేస్తుంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ జరిగిన తీరును వివరిస్తూ అన్ని రకాల ఆధారాలను చూపించినా కూడా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇకనుంచి భాజపా ఎలా ఓటు చోరీ చేసిందో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతలు వివరించాలి" అని పేర్కొన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుగు సాంబమూర్తి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లి రాజు, నాయకులు బొల్ల సూర్యం, జాఫర్, మాజీ ఎంపీటీసీ డైనమిక్ యూత్ ఐకాన్ పూణెం సురేందర్, మాజి వైస్ చైర్మన్ జానీ, అంకపాక నవీన్, వార రవి, వెంకన్న సార్, ఎర్ర సంగి ఎంకన్న, సైదా మియా, కాకాటి భార్గవ్, ఆర్ ఎం కిరణ్, చిన్ని, గోపగాని రాజు, కార్తీక్, అంజిబాబు, ఎల్లయ్య, పెద్దినేని హరినాథ్ బాబు, గిన్నారపు రవి, కల్తీ పద్మ, బానోత్ శారద, మడుగు వెంకటలక్ష్మి, నిర్మల, చిల్లా విజయభారతి విజయభారతి, శ్వేత, విజయలక్ష్మి, సరస్వతి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్