
పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల,పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసు ఆయుధాల ప్రదర్శన (ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాగానే పోలీసు జాగిలం హాని మరియు హ్యాండ్లర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనలను గురించి ఎస్పీ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని, క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగందర్ బాబు RI లు బాబు , మంజునాథ్ ,సురేశ్ బాబు ,RSI లు పోలీస్ సిబ్బంది విధ్యార్థిని విధ్యార్థులు పాల్గొన్నారు.
