
పయ నించే సూర్యుడు (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటరు జాబితా డిజిటల్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఎన్నికల నమోదు అధికారి, ప్రత్యేక ఉప కలెక్టర్ జి మమ్మీ ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండలం పల్లంకుర్రు, పల్లం గ్రామ పంచాయతీల బూత్ స్థాయి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ పురోగతిపై చర్చించారు. తక్కువ ప్రగతి చూపిన బూత్ స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదు కావాలని సూచించారు. ఈ సమీక్షలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రాజేశ్వరావు, పంచాయతీ కార్యదర్శులు రామారావు, శాంతి స్వరూప్, స్వర్ణ తో పాటు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
