ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి ఈరోజు కంచికచర్ల మండలంలో ఎరువుల దుకాణలలో తనిఖి నిర్వహించడం జరిగింది. కంచికచర్ల గ్రమంలో జుజూరు రోడ్డు లో శ్రీ విజయ దుర్గ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టీలేజర్స్ రికార్డుల పరిశీలించగా లైసెన్సు లో ఫారం ఓ లేకపోవటం వలన ఆమకాలని నిలిపివేయ్యడం జరిగింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నందిగామ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ వ్యవసాయ సహాయ సంచలకులు శ్రీమతి శశికళ గారి ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది. ఇందులో మండల వ్యవసాయ ఆధికారి కె. విజయ్ కుమార్ మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.