ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు.కంచికచర్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర దిక్కున ఉండటం విశిష్టతమహావిష్ణువు అవతారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారుఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట.ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు.తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారటఅప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైందిఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది