
పయనించే సూర్యుడు జనవరి 13 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన నిజమైన ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మండిపడ్డారు. నేడు కండలేరు జలాశయం వద్ద ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ , తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు కూటమి ఎమ్మెల్యేలతో కలిసి ఆమె నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను వెల్లడించారు:వైఎస్సార్సీపీ పొలిటికల్ డ్రామాలు - దిష్టి తీత:
ప్రస్తుతం నిండుకుండలా ఉన్న కండలేరు జలాశయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ, జలాశయానికి గుమ్మడికాయతో దిష్టి తీయడం జరిగింది. అభివృద్ధిని అడ్డుకునే శక్తుల నుండి ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.గణాంకాలతో సహా జగన్ రెడ్డి వైఫల్యాలు:గత ఐదేళ్లలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారని, జగన్ పాలనలో సీమ ప్రాజెక్టులు కుంటుపడ్డాయని ధ్వజమెత్తారు:
నిధుల కోత: 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ. 12,441 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం రూ. 2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాయలసీమను వంచించింది.