( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగా నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కడియాలకుంట తండాలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరామా యాడి నూతన గుడి ప్రారంభం మరియు సేవాలాల్ మేరామా యాడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు గత రెండు రోజుల నుంచి ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలను పండితులు సౌమీత్రి పంతులు మరియు రఘు పంతుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి అదేవిధంగా బంజరుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ మరియు మేరామ య్యాడికి బోనాల కార్యక్రమం ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో బంజారాలో తమ వేషధారణతో పాటు తమ బంజారా నృత్యాలతో బంజారా పాటలతో ఎంతో ఘనంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాలను గుడి నిర్మాణ కమిటీ మరియు గ్రామ పెద్దలు ఎంతో భక్తి భావాలతో ఘనంగా జరిపిస్తుంది