
వార్డు సభ్యులు తావు సింగ్ మరియు చట్ పట రవీందర్
( పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని బీటి రోడ్డు ఈరు పక్కల భారీగా పెరిగిన చెట్లను మరియు ముళ్ళకంపలను తొలగించడం జరిగింది. పాదాచారులకు మరియు వాహనాదారులకు ఇబ్బందులు కలుగుతున్న అదృష్ట నూతన సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ తో పాటు ఒకటో వార్డ్ సభ్యులు తావు నాయక్ మరియు వార్డ్ సభ్యుడు చాట్ పట రవీందర్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తావు సింగ్ నాయక్ (రాజా) పాల్గొన్నారు.