భారీ వర్షాలకు గుంతల మయంగా మారిన రోడ్డు
బండ్ల శివ బాబు సహకారంతో మాజీ సర్పంచ్ బుజ్జిరాజు నాయక్ రోడ్డు కు మరమ్మతులు
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా ప్రధాన రోడ్డు గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయంగా మారడం జరిగింది. నిత్యం వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గమనించిన కడియాల కుంట తండా తాజా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మరియు పరమేశ్వర పౌల్ట్రీ యజమాని బండ్ల శివ బాబు సహకారంతో రెడీమిక్స్ పోయించి రోడ్డు పై ఏర్పడిన గుంతలను సరి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్ధి రాజు నాయక్ తో పాటు గ్రామానికి చెందిన పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.