
కడియాల కుంట తండాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా సర్పంచ్ రాజు నాయక్
ఉప సర్పంచ్ గా తావు సింగ్ నాయక్ ప్రమాణస్వీకారం
( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రాజు నాయక్ అనే నేను కడియాలకుంట తండా గ్రామ సర్పంచ్ గా దైవసాక్షంగా ప్రమాణం చేస్తున్నాను… అంటూ ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా లో నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన రాజు నాయక్ చౌహన్ సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గా తావు సింగ్ నాయక్ మరియు ఒకటో వార్డ్ నెంబర్ తావు సింగ్ నాయక్ మూడో వార్డు నెంబర్ గా ప్రియాంక దేవేందర్ నాయక్, నాలుగో వార్డ్ నెంబర్ గా దేవీ రవి నాయక్, ఐదో వార్డ్ నెంబర్ గా నీలా భాస్కర్ నాయక్, ఆరో వార్డ్ నెంబర్ గా చట్ పట్టా రవీందర్ నాయక్ మరియు ఏడో వార్డ్ నెంబర్ గా గోపి నాయక్ ఎనిమిదో వార్డ్ నెంబర్ గా జ్యోతి రాజు నాయక్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్ రాజు నాయక్ మాట్లాడుతూ…. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పార్టీలకతీతంగా తమతో సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. షాద్నగర్ నియోజకవర్గం లోని ఉత్తమ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో ఏ సమస్య అయినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కష్టపడాలని చిన్న పెద్ద తేడా లేకుండా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
