కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కు ఒక కోటి యాభై లక్షల నిధులు మంజూరు..
పయనించే సూర్యుడు// ఫిబ్రవరి 7 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..సబ్ మార్కెట్ యార్డుగా ఉండబడిన కమలాపూర్ మార్కెట్ 2023 వ సంవత్సరంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నుండి విడిపోయి పూర్తిస్థాయి మార్కెట్ గా అవతరించిన తర్వాత, విభజన హామీలలో భాగంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నుండి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కు ఒక కోటి 50 లక్షల నిధులు రావలసిఉంది. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఈ నిధులు రాబట్టుటకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడం జరిగింది. కమలాపూర్ మార్కెట్ కు నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మరియు పాలకవర్గం అట్టి నిధులు ఇప్పించుట కోసం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ని అభ్యర్థించగా ప్రణవ్ బాబు, శ్రద్ధ తీసుకుని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తో మాట్లాడి ఒక కోటి 50 లక్షల నిధులను బై ఫర్ కేషన్ ఒప్పందము ప్రకారం,జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నుండి చైర్మన్ శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి తౌటం ఝాన్సీ రాణి రవీందర్ లకు చెక్కు రూపంలో అందించారు. కమలాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం చొరవ తీసుకుని ఇట్టి నిధులు ఇప్పించిన ఓడితల ప్రణవ్ బాబు కి జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం కు కమలాపూర్ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య గౌడ్ మార్కెట్ డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలియజేసారు. ఇట్టి నిధులను నిబంధనలకు లోబడి మార్కెట్ అభివృద్ధి కోసం వినియోగించడం జరుగుతుందని చైర్మన్ ఝాన్సీ రాణి అన్నారు . ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కార్యదర్శి మల్లేశం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి,డైరెక్టర్ రాజేశ్వరరావు,కమలాపూర్ మార్కెట్ కార్యదర్శి రాజు,మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, గట్టు శ్రీధర్,జనగాని శివకృష్ణ, ఆకిన పెళ్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.